కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ ఆడపిల్లల తల్లిదండ్రులకు తీపి కబురు అందించింది. చిన్న మొత్తాల పొదుపు స్కీమ్… సుకన్య సమృద్ది యోజన యొక్క వడ్డీ రేటు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న 8 శాతం వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేటు జనవరి 2024 నుండి అమలులోకి రానుంది.
మోదీ ప్రభుత్వంలో ఆడ పిల్లల భవిష్యత్తు మెరుగు పడాలనే ఉద్దేశ్యంతో ఆరభించిన భేటీ పడావో – భేటీ బచావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో పదేళ్ల వయస్సు వరకు గల ఆడపిల్లల పేరు మీద సంవత్సరానికి గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ఏ ఇతర బ్యాంకులలో కూడా లేదు. ఈ పథకం ఇద్దరు ఆడపిల్లల వరకు వర్తిస్తుంది.