తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 119 నియోజవర్గాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 64 సీట్లు కైవసం చేసుకొని విజయ దుంధిభ మోగించింది. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సమర శంఖం పూరించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి తెలంగాణ సాధించిన తరువాత మొదటిసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది.


సీయం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..?

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి నియమితులు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్న నాయకుడు శాసన సభకు అధ్యక్షుడు కానున్నాడు. ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు శాసన సభ పక్షం భేటీ కానుంది. ఈ భేటీలో శాసన సభ పక్షం ఎన్నిక తో పాటు వివిధ అంశాలపై చర్చ జరుగనుంది. శాసన సభ పక్షం ఎన్నుకున్న అభ్యర్థి ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.

సోనియా, రాహుల్, ప్రియంకా హాజరు..

లాల్ బహుదూర్ స్టేడియంలో ఈ రోజు జరగబోయే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియంకా గాంధీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసు శాఖ గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తుంది.